శ్రీమతి బద్రి రమారాణి
శ్రీమతి బద్రి రమారాణి

తెలుగు కవి, రచయిత, తెలుగు ఉపాధ్యాయిని .

        దండేపల్లి గ్రామ వాస్తవ్యులు గా దండేపల్లిలో  15 సంవత్సరాలు పాఠశాలను నిర్వహించి ఎందరికో విద్యాబోధన చేశారు. దండేపల్లి లో వివేకానంద విద్యాలయం, శ్రీ సాయిచంద్ర విద్యామందిర్, శ్రీ సరస్వతీ శిశుమందిర్ లతో పాటు సప్తగిరి హైస్కూల్, లక్షట్టిపేట బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ మంచిర్యాల, చొక్కా రామయ్య హైస్కూల్, మంచిర్యాల  మొదలైన పాఠశాలలో తెలుగు భాష బోధనలో తమ సేవలందించారు. ప్రస్తుతం "మిమ్స్ ఉన్నత పాఠశాల"లో సీనియర్ తెలుగు ఉపాధ్యా యిని గా తమ సేవలను అందిస్తున్నారు.

  • మహిళా సాధికారత దిశగా మహిళలకు కుట్టు శిక్షణ అందించడానికి "మాతృశ్రీ మహిళా మండలి" ని దండేపల్లి లో నిర్వహించారు.
  • శ్రీసరస్వతీ శిశు మందిర్ దండెపల్లి శాఖలో ప్రధానాచార్యులు గా తమ సేవలందించారు
  • 2001 లో చంద్రశేఖర సరస్వతి గారి చే యోగా శిక్షణ పొంది అనేక మందికి యోగా లో శిక్షణ అందించారు. ప్రస్తుతం కూడా అందిస్తున్నారు.
  • కాంట్రాక్ట్  తెలుగు లెక్చరర్ గా "ప్రభుత్వ జూనియర్ కళాశాల, బజార్ హత్నూర్" లో పనిచేసి విద్యార్థులను తీర్చిదిద్దారు. 
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం లక్షెట్టిపేట మండల "ఎపిఓ" గా పనిచేసి రాష్ట్రస్థాయి  అధికారుల ప్రసంసలు పొందారు.  రికార్డు స్థాయిలో పనులను కల్పించి, వేతనాలు సకాలంలో అందేలా చేర్యలు తీసుకొని లబ్దిదారుల మెప్పు పొందారు.
  • ఎన్నో బాల గేయాలు, గేయ కవితలు, వచన కవితలు, కథలు, నాటికలు వ్రాసారు.
  • వీరు వ్రాసిన కవితలు "తెలుగు నిజరూపం" పక్ష పత్రిక, "నేటి నిజం"దిన పత్రిక తో పాటు అనేక పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
  • సాహితీ విపంచి-4 కవితాసంపుటితో పాటు అనేక కవితా సంపుటిలలో వీరి కవితలు అచ్చు అయ్యాయి.